Old Generation
. ఒక తరం కనుమరుగౌతుంది, ఒక్కొక్కరుగా, ఒకరి తర్వాత ఇంకొకరుగా.. స్వార్థం లేని తరం, నిస్వార్థంగా అందరి అభివృద్ధిని ఆకాంక్షించిన తరం. మమతను పంచిన తరం. మాధుర్యాన్ని అందించిన తరం. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. ఇరుకు ఇంట్లో కూడా గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. కోరికలకంటే బాధ్యతల్ని ఎరిగిన తరం. నా కోసం అనేకన్నా, మనకోసం అని బ్రతికిన తరం. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. పుస్తకాలు చదువకున్నా, జ్ఞానాన్ని నింపుకున్న తరం. కాలిక్యూలేటర్స్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. మొబైల్ ఫోన్ లు లేకున్నా.. అందరికీ అందుబాటులో ఉన్న తరం. TV లు లేకున్నా సంతోషంగా బ్రతికిన తరం. GPS లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం. సాంకేతికత లేకున్నా, సమర్థవంతంగా బ్రతికిన తరం. AC లు, కూలర్లు లేకున్నా.. ఆరుబయట హాయిగా నిద్రించిన తరం. ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ లేకున్నా.. బావి నీరు, కుళాయి నీరు త్రాగిన తరం. రెస్తారంట్లు, రకరకాల మెనూ ఐటమ్స్ లేకున్నా.. పచ్చడి మెతుకులు తిని కూడా ఆనందంగా బ్రతికిన తరం. రాత్రిళ్ళు గుడి ద...